జావెలిన్ త్రో ప్రాక్టీస్​లో అపశ్రుతి విద్యార్థి మెడలోకి చొచ్చుకెళ్లిన స్టిక్​ - స్టూడెంట్​ మెడలో ఇరుకున్న జావెలిన్​ స్టిక్​

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 17, 2022, 7:04 PM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

ఒడిశాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో శనివారం ప్రమాదవశాత్తు ఓ విద్యార్థి మెడలోకి జావెలిన్​ స్టిక్​ దూసుకెళ్లింది. స్కూల్​ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే స్పోర్ట్స్ ఈవెంట్స్​ కోసం ఓ విద్యార్థి జావెలిన్​ త్రో ప్రాక్టీస్​ చేస్తున్నాడు. అతడు విసిరిన స్టిక్ అక్కడే ఉన్న 9వ తరగతి విద్యార్థి సదానంద్ మెహర్​ మెడలోకి ​ చొచ్చుకుపోయింది. గాయపడిన విద్యార్థిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది పాఠశాల యాజమాన్యం. జావెలిన్​ స్టిక్​ను తొలగించేందుకు ప్రత్యేక డాక్టర్ల బృందం తీవ్రంగా శ్రమించింది. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి నిలకడగానే ఉందని తెలిసింది.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.