దేశానికి సుపరిపాలన అందించిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలి : జానారెడ్డి - జానారెడ్డి ఎవరికి సపోర్ట్ చేశారు
🎬 Watch Now: Feature Video
Published : Nov 14, 2023, 1:01 PM IST
JANA Reddy Support Rohin Reddy at Ambarpet Constituency : దేశానికి సుపరిపాలన అందించిన కాంగ్రెస్ పార్టీని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని మాజీ హోంమంత్రి కుందూరు జానారెడ్డి(JANA Reddy) కోరారు. అంబర్పేట కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రోహిన్ రెడ్డికి మద్దతుగా జానారెడ్డి సోమవారం రాత్రి నల్లకుంట డివిజన్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తొమ్మిదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చివేసిందని మండిపడ్డారు.
JANA Reddy in Election Campaign 2023 : కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని, పేద ప్రజలకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రోహిన్ రెడ్డి అంబర్ పేట నియోజకవర్గానికి చెందిన వాడని, స్థానికుడని, హస్తం గుర్తుకు ఓటు వేసి ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. రోహిన్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే, అంబర్పేట అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని జానారెడ్డి హామీ ఇచ్చారు.