Kothagudem MLA Controversy On HC : 'కొత్తగూడెం ఎమ్మెల్యేగా నాతో ప్రమాణ స్వీకారం చేయించాలి' - Kothagudem MLA ticket dispute High Court verdict
🎬 Watch Now: Feature Video
Jalagam Venkatarao MLA Election Controversy : కొత్తగూడెం ఎమ్మెల్యేగా తనను పరిగణించి ప్రమాణ స్వీకారం చేయించాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శిని జలగం వెంకట్రావు కోరారు. వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను రద్దు చేస్తూ జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పును ఇరువురికి అందచేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడి ఆయన చాంబర్‌లో వివరాలు సమర్పించినట్లు జలగం తెలిపారు. అసెంబ్లీ కార్యదర్శిని నేరుగా కలిసి ప్రమాణ స్వీకరణ ప్రక్రియ నిర్వహించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఖమ్మం జిల్లాలో 2014లో బీఆర్ఎస్ నుంచి తాను ఒక్కడినే గెలిచానని జలగం వెంకట్రావు స్పష్టం చేశారు. రాజకీయ కుతంత్రాల వలన 2018లో ఓడిపోయినప్పటికీ.. బీఆర్ఎస్లో ఉన్నానని తెలిపారు. భవిష్యత్తులోనూ కేసీఆర్ నాయకత్వంలోనే కొనసాగుతానని జలగం స్పష్టం చేశారు. కోర్టు తీర్పు అనంతరం బీఆర్ఎస్ అధిష్టానంతో చర్చించినట్లు ఆయన వివరించారు. తప్పుడు వివరాలతో వాస్తవాలను దాచిపెట్టి ఎన్నికల అఫిడవిట్ ఇచ్చినందుకు వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను రద్దు చేసి ఆయనకు రూ.5లక్షల జరిమానాను హైకోర్డు విధించిన సంగతి తెలిసిందే.