Jagannadh Ratha Yatra in Hyderabad : హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర - హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్ర
🎬 Watch Now: Feature Video

Jagannadh Ratha Yatra in Kukatpally in Hyderabad : ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా నిర్వహించే జగన్నాథ్ రథయాత్ర హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఈ యాత్ర సాగింది. జగన్నాథుడ్ని అందంగా పూలతో అలంకరించారు. ఇరువైపులా బలరాముడు, సుభద్రాదేవి కొలువుదీరి హైదరాబాద్ నగర వాసులకు దర్శనమిచ్చారు. ఈ యాత్రలో భక్తులు జయ జయ ధ్వానాలు.. యువతీ యువకుల కోలాటాలు భజనలతో ఆహ్లాదంగా సాగింది.
ఇందిరాపార్క్ నుంచి ప్రారంభమై జలవిహార్ వరకు.., బంజారాహిల్స్ రోడ్ నెం.12 ప్రారంభమై నగర పురవీధుల్లో, హైదర్‌నగర్ నుంచి ప్రారంభమై బాలానగర్ మెట్రోస్టేషన్ వరకు.. ఇలా తదితర ప్రాంతాల్లో యాత్రని నిర్వహించారు. రథయాత్రలో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ యాత్ర వల్ల నగరంలో పలు చోట్ల ట్రాఫిక్‌కి అంతరాయం కలిగింది. దీనికోసం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాహనాలను యాత్ర జరిగే మార్గం వైపు కాకుండా వేరే దారి నుంచి పంపించారు. దీంతో ప్రశాంతంగా జగన్నాథ్ రథయాత్ర ముగిసింది.