శంకర్‌పల్లిలో సినీనటి రష్మి గౌతమ్ సందడి - తరలివచ్చిన అభిమానులు - Gautham of Jabardasth fame
🎬 Watch Now: Feature Video
Published : Dec 21, 2023, 10:39 PM IST
Jabardasth fame Rashmi Gautham in Shankarpally : రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో జబర్ధస్త్ ఫేమ్, సినీనటి రష్మి గౌతమ్(Rashmi Gautham) సందడి చేశారు. సంప్రదాయ చీరకట్టులో ముస్తాబై ఓ ఫ్యాషన్ షాపింగ్ మాల్‌ను ఆమె ప్రారంభించారు. రష్మిక తమ ప్రాంతానికి వస్తున్నారని తెలుసుకున్న అభిమానులు ఆమెను చూడటానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
Actress Rashmi Gautam in Shankarpally : దీంతో అక్కడి ప్రాంతమంతా అభిమానులతో కిక్కరిసిపోయింది. వారి కేరింతలతో షాపింగ్ మాల్ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ఆమెను చూడటానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన యువతి, యువకులకు రష్మీ గౌతమ్‌ను అభివాదం చేస్తూ వారిలో ఉత్సహం నింపారు. తన కోసం ఇంత మంది తరలి రావడం చాలా సంతోషంగా ఉందని మీ ప్రేమాభిమానలను ఇలాగే కొనసాగించాలని కోరారు. సందర్భానికి తగిన విధంగా వస్త్రాదరణ ఉండాలని అన్నారు. వివిధ వస్తువుల కొనుగోళ్లకు ఆన్లైన్ షాపింగ్‌కు కాకుండా ఆఫ్‌లైన్ షాపింగ్ చేయాలని రష్మీ గౌతమ్ సూచించారు.