ఐటీ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతాం : మంత్రి శ్రీధర్‌బాబు - తెలంగాణలో 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం
🎬 Watch Now: Feature Video
Published : Dec 10, 2023, 9:04 AM IST
IT Minister Sridhar Babu Interview : పారిశ్రామిక, ఐటీ రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామని, రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు వీలైనంత ఎక్కువ కల్పించడమే ధ్యేయంగా చర్యలు తీసుకుంటామని పరిశ్రమలు, ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణలో అణిముత్యాలాంటి పరిశ్రమలున్నాయని పేర్కొన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన ఐటీఐఆర్ విషయంలో ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పారు.
ఫార్మాసిటీ విషయంలో ప్రజల ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకొని ఓ నిర్ణయానికి వస్తామని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. అలాగే ఐటీ రంగంలో హైదరాబాద్‌కు ప్రత్యేకతో పాటు ఇంకా గొప్పతనాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. అధికారపార్టీతో పాటు, ఎంఐఎం, ప్రతిపక్ష, మిత్రపక్షల సహకారం కోరి సజావుగా అసెంబ్లీ సెషన్‌ని నడిపే ప్రయత్నం చేస్తామని తెలిపారు. అన్ని అంశాలపై శాసనసభలో మంచి ఫలవంతమైన చర్చ జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. అధికారులతో సమీక్ష నిర్వహించి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి వైపు తీసుకువెళ్లాలో చర్చిస్తామంటున్న ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ముఖాముఖి.