ISO Certificate to Shirdi Saibaba Sansthan: పరిశుభ్రతలో శిరిడీ సాయిబాబా సంస్థాన్‌కు ఐఎస్ఓ గుర్తింపు - ISO certificate to shirdi Saibaba dharamshala
🎬 Watch Now: Feature Video
Published : Aug 23, 2023, 8:04 PM IST
|Updated : Aug 23, 2023, 8:09 PM IST
Saibaba Sansthans dharamshala gets ISO certification for cleanliness: శిరిడీలోని సాయిబాబా ప్రసాదాలయంతో పాటు, సాయిబాబా సంస్థాన్లకు పరిశుభ్రత అంశంలో ఐఎస్ఓ(ISO) గుర్తింపును పునరుద్ధరించిందని సీఈఓ పి. శివశంకర్ తెలిపారు. ఐఎస్ఓ గుర్తింపు పొందడంతో సాయి సంస్థాన్ మరో కీర్తి కిరీటం పొందినట్లైందని పేర్కొన్నారు. శిరిడీ సాయిబాబాను దర్శించుకునేందుకు ఏటా కోటి మందికి పైగా భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం సాయిబాబా సంస్థాన్ ఆధ్వర్యంలో భక్త నివాస్‌లను నిర్వహిస్తున్నారు. సంస్థాన్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ సుమారు 25 నుంచి 30 వేల మందికి పైగా భక్తులకు అన్నదానం చేస్తారు. సాయి సంస్థాన్ ఆసియాలోనే అతి పెద్ద ప్రసాదాలయాన్ని నిర్వహిస్తోందనీ... ఇంత పెద్ద ప్రసాదాలయం పరిశుభ్రంగా నిర్వహిస్తున్నందున... సాయిబాబా సంస్థాన్, సాయి ప్రసాదాలయానికి 2010లో ఐఎస్ఓ(ISO) గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.
సాయిబాబా సంస్థాన్‌కు చెందిన సాయి ఆశ్రమ భక్త నివాస్, సాయి ప్రసాద్, దారావతి భక్త నివాస్‌లు పరిశుభ్రత పాటించినందుకుగానూ... 2014లో ఐఎస్ఓ(ISO) గుర్తింపును పునరుద్ధరిస్తూ వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం.. ఐఎస్ఓ(ISO) అధికారులు.. సాయి సంస్థాన్ పరిశుభ్రతను సమీక్షించడానికి శిరిడీకి వస్తున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు. సాయిబాబా ఆలయం, నిర్వాహణ, పరిశుభ్రత ఆధారంగా ప్రతి సంవత్సరం ఐఎస్ఓ(ISO) గుర్తింపును పునరుద్ధరిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో సాయి సంస్థాన్‌కు ఐఎస్ఓ(ISO) ఆడిటర్ కేశు మూర్తి ఆధ్వర్యంలో మరోమారు సాయి ఆలయానికి గుర్తింపును పునరుద్ధరించారని తెలిపారు. ఈ సందర్భంగా సాయిబాబా ఆలయ అధికారులు మాట్లాడుతూ... గత 14 సంవత్సరాల నుండి సాయిబాబా సంస్థాన్ పరిశుభ్రతలో మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. ISO సర్టిఫికెట్ పొందడంపై సాయి సంస్థాన్ ఉద్యోగులు, అధికారులు ఆనందం వ్యక్తం చేశారు.