రామ మందిర ప్రారంభోత్సవానికి షిర్డీ సాయికి ఆహ్వాన పత్రిక - అయోధ్య వార్తలు
🎬 Watch Now: Feature Video
Published : Jan 11, 2024, 10:27 PM IST
Invitation to Shirdi Sai for Rama Mandir Opening Ceremony: జనవరి 22న అయోధ్యలో జరగనున్న శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం కోసం అయోధ్య ట్రస్ట్ తరపున షిర్డీ సాయిబాబా దేవస్థానానికి ఆహ్వాన పత్రిక అందింది. శ్రీరామ్ లల్లా మూర్తి ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో పాల్గొనడానికి ఈరోజు అధికారిక ఆహ్వాన పత్రిక అందినట్లు షిర్డీ దేవస్థానం అధికారులు వెల్లడించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తరపున ప్రణవ్ పవార్ ఈరోజు షిర్డీ ఆలయాన్ని సందర్శించారు. సాయిబాబాకు రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తూ తీసుకొచ్చిన పత్రికను మెుదట సాయిబాబా సమాధిపై ఉంచారు. అనంతరం షిర్డీ దేవస్థానం సీఈఓ తుకారాం ముండేకు ఆ ఆహ్వాన పత్రికను అందజేశారు.
గత కొన్ని రోజులుగా అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు రాజకీయ, సామాజిక, ధార్మిక తదితర రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. కానీ, ఇప్పటి వరకూ షిర్డీ సాయిబాబా దేవస్థానానికి ఆహ్వానం అందలేదు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు చర్చలు జరిగాయి. తాజాగా సాయిబాబా సంస్థానానికి అధికారిక ఆహ్వాన పత్రం అందడంతో భక్తుల్లో ఉత్కంఠ వీడింది. సాయి దేవస్థానానికి అధికారిక ఆహ్వానం అందడంతో జనవరి 22న సాయిబాబా షిర్డీ సాయి దేవస్థానం తరపున ఎవరు అయోధ్యకు వెళతారో చూడాలి.