బహుజన వాదం వస్తేనే బతుకులు మారుతాయి : పుష్పిత లయ - BSP candidate Pushpitha Laya

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 18, 2023, 4:45 PM IST

Interview with BSP Candidate Pushpitha laya : రాష్ట్రంలో పోలింగ్ డే సమీపిస్తోంది. ఎన్నికల ప్రచారాలు హోరెత్తుతున్నాయ్. ప్రధాన పార్టీల అభ్యర్ధులు ధీటుగా ప్రచారం చేస్తున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ బరిలో నిలిచిన బహుజన సమాజ్ పార్టీ నుంచి తొలి ట్రాన్స్​జెండర్ అభ్యర్ధి.. పుష్పిత లయ ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. 

Telangana Assembly Elections 2023 : బీఎస్పీ నియోజకవర్గ ఇన్​చార్జ్​గా తన పని తీరు చూసి తనకు టిక్కెట్ ఇచ్చిన బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్​కు.. పుష్పిత లయ కృతజ్ఞతలు తెలిపారు. రాణి రుద్రమ స్ఫూర్తితో.. ప్రధాన పార్టీల అభ్యర్ధులను ఎదుర్కొని విజయం దక్కించుకుంటానని చెపుతున్నారు. బహుజన వాదం వస్తేనే మన బతుకులు మారుతాయంటున్నారు. ప్రజలకు ఉన్న ఆయుధం ఓటు హక్కును వినియోగించుకుని.. సమర్థ నాయకుణ్ని ఎన్నుకుంటేనే కష్టాలు కడతేరుతాయంటున్నారు. కేసీఆర్ హయాంలో మహిళలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని దుయ్యబట్టారు. యువతకు ఉద్యోగ కల్పనలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. బీఎస్పీ అభ్యర్థి పుష్పిత లయతో మా ప్రతినిధి ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.