లోక్​సభ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీ పుంజుకుంటుంది : రంజిత్​ రెడ్డి - Ranjith Reddy latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 28, 2023, 3:02 PM IST

Interview With Chevella BRS MP Ranjith Reddy : లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా పుంజుకుంటుందని చేవెళ్ల బీఆర్​ఎస్​ ఎంపీ రంజిత్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. పది సంవత్సరాలు తర్వాత ప్రజలు ఎలైగైనా ప్రజలు మార్పు కోరుకుంటారు. జాతీయ స్థాయిలో రాజకీయాల్లో కేసీఆర్​ ఉనికిని చాటడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రాష్ట్రం ఏర్పాటులో ఎంతో ముఖ్యపాత్ర పోషించాడు. ఆ తర్వాత తెలంగాణను, ఆదర్శంగా ఎలా ముందుకు తీసుకెల్లాలో ఆయనకే తెలుసు. ప్రజలు కేసీఆర్​కే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు.  

BRS MP Ranjith Reddy : కేసీఆర్ ముఖ్యమంత్రి కానందుకు ఇప్పటికే చాలా మంది ప్రజలు బాధ పడుతున్నారని వ్యాఖ్యానించారు. బీఆర్​ఎస్​నే రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్ష అన్న ఆయన రెండు అధికార పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ల కంటే బీఆర్​ఎస్​ వైపే జనం నిలబడతారని తెలిపారు. జనవరి మూడో తేదీ నుంచి పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఉంటాయని వెల్లడించారు. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ ఉంటుందంటున్న చేవెళ్ల బీఆర్​ఎస్​ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డితో ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.