highest annual salary package in Warangal NIIT : తిరస్కరించినా.. తానేంటో నిరూపించుకున్నాడు - వరంగల్ జిల్లా వార్తలు
🎬 Watch Now: Feature Video
highest annual salary package in Warangal NIIT : చదువు పూర్తయ్యాక.. యువత ఉద్యోగాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం నిన్నటి మాట. ఇప్పుడు కోర్సు పూర్తికాకుండానే క్యాంపస్ సెలక్షన్స్లో ఎంపికై లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీ వేతనంతో కొలువులు సాధించడం నేటి మాట. ప్రతిష్ఠాత్మకమైన వరంగల్ నిట్లో విద్యార్ధులు ఈ విద్యా సంవత్సరంలో రికార్డు స్ధాయిలో ప్రాంగణ నియామకాలకు ఎంపికయ్యారు. ఈ సంవత్సరం కంపెనీలు నిర్వహించిన ప్రాంగణ నియామాకాల్లో 1400 మందికి పైగా విద్యార్ధులు వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు.
ఇందులో బీటెక్ కంప్యూటర్సైన్స్ విద్యార్ధి ఆదిత్య సింగ్ వరంగల్ నిట్ చరిత్రలోనే అత్యధిక వార్షిక వేతనం 88 లక్షల రూపాయలతో.. బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో కొలువు సాధించి రికార్డు నెలకొల్పాడు. మొదట్లో వచ్చిన కంపెనీలు ఆదిత్య సింగ్ను తిరస్కరించినా.. నిరాశపడకుండా కష్టపడి చదివి అత్యధిక వార్షిక వేతనంతో ఉద్యోగం పొంది ఔరా అనిపించాడు. అపజయాలు ఎదురైనా వెనుకంజ వేయకుండా పట్టుదలతో సాధిస్తే విజయలక్ష్మి తప్పక వరిస్తుందంటున్న ఆదిత్యసింగ్తో ముఖాముఖి