International Egg Person of The Year 2023 : ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్​ ఆఫ్ ది ఇయర్​గా హైదరాబాద్​ వాసి - ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ 2023 జగపతి రావు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Oct 13, 2023, 4:25 PM IST

International Egg Person of The Year 2023 : కోడి గుడ్ల వ్యాపారాన్ని విశ్వవ్యాప్తంగా వృద్ధి చేస్తున్న వారికి అందించే ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2023 అవార్డు హైదరాబాద్​కు చెందిన శ్రీనివాస ఫార్మ్ గ్రూప్ ఛైర్మన్ చిట్టూరి జగపతి రావును వరించింది. ఇంటర్నేషనల్ ఎగ్ కమిషన్ అందించిన ఈ అవార్డును ఆయన కుమారుడు సురేశ్ రాయుడు అందుకున్నారు. ఆసియా దేశాల నుంచి ఈ అవార్డును అందుకున్న తొలి వ్యక్తి జగపతి రావు కావటం విశేషం.

కేవలం తాను స్థాపించిన శ్రీనివాస ఫామ్స్ గ్రూప్ కోసం మాత్రమే కాకుండా పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధికి ఆయన విశేష కృషి చేశారు. భారత్​లో ఎగ్​ కో ఆర్డినేషన్ కమిటీ వ్యవస్థాపకుల్లో జగపతి రావు ఒకరు కావటం గమనార్హం. ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్​గా ఎంపిక కావటం పట్ల జగపతి రావు హర్షం వ్యక్తం చేశారు. వచ్చే 20 ఏళ్లలో గుడ్డు వినియోగం దాదాపు మూడు రెట్లు పెరిగే అవకాశం ఉందని.. గుడ్డు తినటం ద్వారా ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చన్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.