Aamir Khan Mahabharata Movie : బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ 'మహాభారతం' ప్రాజెక్ట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. ఆ సినిమా విషయంలో తనపై ఎంతో బాధ్యత ఉందని తెలిపారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఆ సినిమా తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆమిర్ ఈ కామెంట్స్ చేశారు.
'నా డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం పట్ల నాపై చాలా బాధ్యత ఉంది. దాంతోపాటు భయం కూడా ఉంది. ఎక్కడా పొరపాటు లేకుండా భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్ రూపొందించాలని అనుకుంటున్నాను. భారతీయులుగా ఈ కథ మన రక్తంలోనే ఉంది. కాబట్టి, ఇది నాపై ఎంతో బాధ్యత పెంచింది. అందుకే దీనిని సరైన పద్ధతిలో సక్రమంగా తీర్చిదిద్దాలనుకుంటున్నా. ఈ ప్రాజెక్ట్‌తో భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చూపించాలని అనుకుంటున్నా. ప్రతి భారతీయుడు గర్వపడేలా చేయాలనుకుంటున్నా. ఇది జరుగుతుందో? లేదో? తెలియదు. కానీ నేను మాత్రం దీని కోసం హార్డ్ వర్క్ చేయాలనుకుంటున్నా' అని ఆమిర్ ఖాన్ చెప్పారు. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉన్నట్లు గతంలో బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి.
కాగా, ఆయన నిర్మాతగా వ్యవహరించిన 'లపతా లేడీస్' సినిమా మంచి విజయం దక్కించుకుంది. డైరెక్టర్ కిరణ్ రావు దీనికి దర్శకత్వం వహించారు. 2025 ఆస్కార్ పోటీలకు ఈ సినిమా భారత్ నుంచి అధికారికంగా ఎంపికైంది. ఈ క్రమంలో ఆస్కార్ ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమిర్ ఖాన్ ఈ కామెంట్స్ చేశారు. అలాగే నిర్మాణ రంగంపై కూడా మాట్లాడారు.
'భవిష్యత్తులో మరెన్నో చిత్రాలు నిర్మించాలనుంది. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలని ఉంది. గొప్ప కథలను ప్రేక్షకులకు అందించాలనేదే నా ఆలోచన. నిర్మాతగా మారినప్పటికీ నటుడిగానూ సినిమాల్లో నటిస్తా. ప్రస్తుతం రెండు, మూడేళ్లకు ఒక సినిమా చేస్తున్నా. రానున్న రోజుల్లో సంవత్సరానికి కనీసం ఒక సినిమా చేయాలని అనుకుంటున్నా' అని అన్నారు.
నార్త్‌లో షూటింగ్! - 29 ఏళ్ల తర్వాత ఒకే స్క్రీన్‌పై రజనీ, ఆమిర్!
ఆ సినిమాను ఈ ముగ్గురు రిజెక్ట్ చేశారు! - ఖాన్స్ కాదన్న ఆ కథ ఏదంటే?