ETV Bharat / state

పెరుగు మజ్జిగైంది, గుడ్డు సైజ్ మారింది - తనిఖీకి వచ్చిన కలెక్టర్ రియాక్షన్ చూడండి - SW HOSTEL CARETAKER SUSPEND

భువనగిరిలోని సోషల్ వెల్​ఫేర్ రెసిడెన్షియల్‌ హాస్టల్​లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ - భోజనం మెనూ పాటించడం లేదని కేర్ టేకర్ రమేష్ సస్పెండ్ - ప్రిన్సిపల్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ

Collector suspends social welfare hostel caretaker
Collector suspends social welfare hostel caretaker (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 16, 2024, 9:44 PM IST

Collector suspends social welfare hostel caretaker : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ హాస్టల్​ను కలెక్టర్ హనుమంతరావు ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిన్న హాస్టల్​ను సందర్శించిన ఆయన వంటగదిలో ఆహారపదార్థాలు, కూరగాయలు తనిఖీ చేశారు. శుచి, శుభ్రత, ఉండేలా నాణ్యమైన ఆహారం విద్యార్థులకు అందివ్వాలని హాస్టల్ నిర్వాహకులకు ఆదేశించారు.

Collector suspends social welfare hostel caretaker
భువనగిరిలోని సోషల్ వెల్​ఫేర్ రెసిడెన్షియల్‌ హాస్టల్​లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ (ETV Bharat)

ప్రిన్సిపల్​కు షోకాజ్​ నోటీసులు జారీ : అయితే 24 గంటలు గడవక ముందే ఈరోజు హాస్టల్ నిర్వాహకులు ఆహారంలో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. ఇవాళ మరోసారి తనిఖీకి వచ్చిన కలెక్టర్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేర్ టేకర్ రమేష్​ను అక్కడికక్కడే సస్పెండ్ చేశారు. ప్రిన్సిపల్​కి షోకాజ్ నోటీసు జారీ చేశారు. మధ్యాహ్న భోజనంలో కొత్త మెనూ పాటించడం లేదని కలెక్టర్ గుర్తించారు. విద్యార్థులకి పెట్టే గుడ్లు సరిగా లేకపోవడం,విద్యార్థుల చేత పనిచేయించడం, పెరుగుకు బదులు మజ్జిగ సరఫరా చేయడం, డైనింగ్ హాల్​లో కొత్త మెనూ బోర్డు ఏర్పాటు చేయకపోవడం, డైనింగ్ హాల్ శుభ్రం లేకపోవడాన్ని కలెక్టర్ గుర్తించారు.

హాస్టల్​ కేర్ టేకర్​ను సస్పెండ్​ చేసిన కలెక్టర్​ : నిన్న విద్యార్థులకు పెరుగు వడ్డించగా.. ఈరోజు మజ్జిగగా ఎలా మారిందంటూ రమేష్​ను నిలదీశారు. మెనూ ఏంటని అడగడగా సరిగా నీళ్లు నమిలారు. అధికారులు వరుస తనిఖీలు చేస్తున్నా నిర్వాహకులు అలసత్వం ప్రదర్శించడంపై మండిపడ్డారు. బాధ్యుడైన కేర్ టేకర్ రమేష్​ను సస్పెన్షన్ చేస్తూ కలెక్టర్ హనుమంతరావు ఆదేశాలు జారీ చేశారు.

టీచర్​ అవతారమెత్తిన కలెక్టర్​ - ఇంటర్ విద్యార్థులకు ఫిజిక్స్ పాఠాలు - District Collector Become a Teacher

తూప్రాన్ బీసీ హాస్టల్​ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి పొన్నం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.