Inter Student Died Of Heart Attack In Khammam : గుండె పోటుతో ఇంటర్ విద్యార్థిని మృతి - Inter Student Died Of Heart Attack
🎬 Watch Now: Feature Video
Published : Sep 25, 2023, 1:18 PM IST
Inter Student Died Of Heart Attack In Khammam : ఇంటర్ ప్రధమ సంవత్సరం చదువుతున్న ఎంపీసీ విద్యార్థిని పల్లవి అనుమానాస్పద మృతి ఖమ్మంలో ఉద్రిక్తతకు దారి తీసింది. ఖమ్మం పోలీస్ కాలనీలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎంపీసీ విద్యార్థిని పల్లవి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆదివారం మధ్యాహ్నం హాస్టల్ గదిలో అస్వస్థతకు గురై బెడ్ పై నుంచి కింద పడింది. వెంటనే తోటి విద్యార్థులు సమాచారం ఇవ్వడంతో అక్కడి సిబ్బంది ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళుతూనే విద్యార్థిని చనిపోయింది.
మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కాగా కళాశాల సిబ్బంది గుండెపోటుతో మృతి చెందిందని చెబుతుండగా.. విద్యార్థిని మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని న్యాయ విచారణ జరిపి కళాశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కళాశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం గేట్లు తోసుకొని లోపలికి వెళ్లారు. దీంతో కళాశాల సిబ్బందికి విద్యార్థి సంఘ నాయకుల మధ్య తోపులాట జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు.