స్వామి వివేకానంద వేషధారణలో ఎల్బీనగర్ స్వతంత్ర అభ్యర్థి ప్రచారం - ఎల్బీనగర్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి వసంతరాయులు
🎬 Watch Now: Feature Video


Published : Nov 27, 2023, 9:35 PM IST
Independent MLA Candidate Innovative Election Campaign : ఎల్బీనగర్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి డా.వీరభోగ వసంతరాయులు స్వామి వివేకానంద వేషధారణలో ప్రచారం చేశారు. ఆయన రోజుకొక స్వామి వివేకానంద, భగత్ సింగ్, అంబేడ్కర్ వేషధారణలో ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హయత్నగర్ నుంచి దిల్సుఖ్నగర్ వరకు ఇవాళ స్వామి వివేకానంద వేషంలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్య సమర యోధుల స్ఫూర్తితోనే తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని తెలిపారు.
ఓటర్లకు ఓటు అవగాహన కల్పిస్తూ పాదయాత్ర చేపట్టామని వసంతరాయులు చెప్పారు. ఈ ఎన్నికల్లో యువత ఓటు కీలకం కానుందని అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలు కుట్టు మిషన్ గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు. తాను గెలిస్తే నియోజకవర్గంలో ఇల్లు లేనివారికి ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు ఉచిత కోచింగ్, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. బహుజన వాదని, కుమ్మరి సామాజిక వర్గానికి చెందిన తనను అత్యధిక మెజార్టీతో ఎల్బీనగర్ ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.