అక్రమంగా మద్యం తరలింపు - 384 లిక్కర్ బాటిల్స్ సీజ్ - నిజామాబాద్‌లో అక్రమంగా తరలిస్తున్న మద్యం కేసు
🎬 Watch Now: Feature Video
Published : Nov 22, 2023, 12:02 PM IST
Illegal Liquor Transport in Telangana 2023 : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రభావం దృష్ఠ్యా మద్యం ఎరులై పారుతోంది. పోలీసుల విస్తృత తనిఖీల్లో పలుచోట్ల మద్యం పట్టుబడుతోంది. తాజాగా నిజామాబాద్‌లో 384 మద్యం సీసాలు అక్రమంగా తరలిస్తున్న ఓ వాహనాన్ని ఎల్లారెడ్డి ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. గాంధారి నుంచి చద్మల్ వైపు వెళ్తున్న వాహనాలను తనిఖీ చేయగా టాటా మ్యాజిక్ ఆటోలో ఎనిమిది మద్యం పెట్టెలను గుర్తించారు.
Illegal Liquor Seized in Nizamabad : మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆటోను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. వాహనంలో ఉన్న వ్యక్తి నేరెలు తండాకు చెందిన రమేశ్గా గుర్తించారు. రమేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. స్వాధీనం చేసుకున్న మొత్తం మద్యం, వాహనం విలువ సుమారు రూ. 4 లక్షల 75 వేల ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తుండగా మద్యం భారీగా పట్టుబడుతోంది.