Hyderabad Ganesh Immersion 2023 : జైజై గణేశా.. బైబై గణేశా.. చిత్రా లే అవుట్ కాలనీలో ఘనంగా వినాయక నిమజ్జనం - చిత్రా లేఅవుట్ గణేష్ నిమజ్జనం
🎬 Watch Now: Feature Video
Published : Sep 29, 2023, 10:50 AM IST
Hyderabad Ganesh Immersion 2023 : రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా తీన్మార్ బ్యాండ్, డీజే సౌండ్లు.. భక్తుల నృత్యాలతో సందడి వాతావరణం కనబడుతోంది. హైదరాబాద్ ఆర్కేపురం పరిధిలోని చిత్రా లేఅవుట్‌లో 16ఏళ్లుగా ఏర్పాటు చేస్తున్న మట్టి గణపతి ఈ సారి కూడా ఆకట్టుకుంది. పర్యావరణ పరిరక్షణపై చిన్న పిల్లలకు, కాలనీవాసులకు అవగాహన కల్పిస్తూ..అపార్ట్‌మెంటు వాసులంతా ప్రతి ఏడాది ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు.
చిత్రా లేఅవుట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. 11 రోజులపాటు పూజలందుకున్న గణపయ్యను సరూర్నగర్ చెరువులో నిమజ్జనానికి అపార్ట్‌మెంటు వాసులంతా కలిసి ఆటాపాటలతో ఘనంగా సాగనంపారు. ప్రతి పండుగను కాలనీవాసులంతా కలిసి పండగ వాతావరణంలో జరుపుకుంటామని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పెండ్యాల నగేశ్ అన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సారి కూడా మట్టి గణపతికి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి నిమజ్జనాన్ని ఎంతో వైభవంగా జరుపుకున్నామని ఆయన తెలిపారు.