Hyderabad Fire Accident Today : వనస్థలిపురంలో అగ్ని ప్రమాదం.. - తెలంగాణ తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
Fire Accident in Vanasthalipuram: భాగ్యనగరంలో తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఎన్ని అవగాహన కార్యక్రమాలు చెేపట్టినా ప్రమాదాలు తగ్గడం లేదు. హైదరాబాద్ వనస్థలిపురంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. సుబ్బయ్య గారి హోటల్లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
కార్మికులు ప్రమాదాన్ని పసిగట్టి వెంటనే డయల్ 100కి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో అదే భవనంలో 40 మంది కార్మికులు నిద్రిస్తుండగా వారిని పోలీసులు కాపాడారు. మంటలు ఇతర భవనాలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. హోటల్లో ఉన్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. విద్యుదాఘాతం కారణంగానే మంటలు చెలరేగాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఎంతమేరకు ఆస్తినష్టం జరిగిందనేది ఇప్పుడే అంచనా వేయలేమని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.