thumbnail

By ETV Bharat Telangana Team

Published : Nov 22, 2023, 1:42 PM IST

ETV Bharat / Videos

ఉత్తమ్ వర్సెస్ సైదిరెడ్డి - హుజూర్​నగర్​లో కిడ్నాప్ డ్రామా - అసలేం జరిగింది?

Huzurnagar Latest Politics in Huzurnagar : సూర్యాపేట జిల్లాలోని హుజూర్​నగర్​ నియోజకవర్గంలో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి, ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆరోపించారు. ఎన్నికలను నిర్వహించే ప్రతినిధులను ఎమ్మెల్యే సైదిరెడ్డి బలవంతంగా కిడ్నాప్ చేశారని పోలీస్ స్టేషన్​ ఎదుట బైఠాయించారు. విజయవాడకు చెందిన చాణక్య అనే సంస్థకు హుజూర్ నగర్ నియోజకవర్గంలో తన ఎన్నికలను నిర్వహించేందుకు బాధ్యతలు అప్పగించామని తెలిపారు.

వారిని ఎమ్మెల్యే సైదిరెడ్డి బలవంతంగా కారులో ఎక్కించుకొని తనకు అనుకూలంగా పనిచేయాలని బెదిరించారని ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆరోపించారు. ఈ విషయం సీఐకి తెలుసని, సీఐ ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఉత్తమ్​ అన్నారు. తమకు పోలీస్​ వ్యవస్థపై నమ్మకం లేదని తెలిపారు. ఈ విషయంపై ఎన్నికల అధికారికి పిర్యాదు చేస్తామని వెల్లడించారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఉత్తమ్​ డిమాండ్​ చేశారు.

Saidireddy Reacts To Uttam Kumar Reddy Comments : ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తనపై చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే సైదిరెడ్డి స్పందించారు. ఉత్తమ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తమ్​కు ఓడిపోతాననే భయం పట్టుకుందని అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని అన్నారు.  రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఉత్తమ్​కు సైదిరెడ్డి సూచించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.