Hundi Theft in Vanaparthi District : కారులో వచ్చి పట్టపగలే హుండీ చోరీ.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు - Vanaparthi District News
🎬 Watch Now: Feature Video
Hundichori in hanuman temple at Pathakishtampally village : కారులో దర్జాగా వచ్చి ఆలయంలోని హుండీ చోరీ చేసిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. అమరచింత మండలం పాత కిష్టంపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి ఆలయంలోని హుండీ చోరీకి గురైంది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ముంపు గ్రామమైన కిష్టంపల్లె నిర్వాసితులకు.. నందిమల్ల ఎక్స్‌రోడ్డులో ఇళ్లు నిర్మించి గ్రామ పంచాయతీగా చేశారు. ముంపులో ఇళ్లు, భూములు మునిగినా, ఆంజనేయస్వామి ఆలయంలో మాత్రం.. నేటికీ గ్రామ ప్రజలు నిత్యపూజలు చేస్తుంటారు. శ్రావణ మాసంలో భక్తుల రాక అధికంగా ఉంటుంది. అందుకే ఆలయంలో సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు. 20వ తేదీ మధ్యాహ్నం టీఎస్ 34 టీఏ 0783 నెంబరున్న కారులో పురుషుడు, మహిళ ఆలయానికి వచ్చి హుండీని చోరీ చేశారు. ఆ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. హుండీలోని నగదు, ఆభరణాలు సంచిలో నింపుకొని పరారయ్యారు. రూ.2 లక్షల నగదు, వెండి ఆభరణాలు చోరీ అయినట్లు ఆలయ కమిటీ సభ్యులు అమరచింత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.