జహీరాబాద్లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో చోరి - సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు - జగిత్యాల జిల్లా ఆలయాల్లో చోరి
🎬 Watch Now: Feature Video
Published : Dec 2, 2023, 4:31 PM IST
Hundi Theft at Peddamma Thalli Temple at Zaheerabad : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో చోరి జరిగింది. పట్టణంలోని హమాలీ కాలనీ పరిసరాలోని ఆలయంలోకి గుర్తుతెలియని యువకుడు ప్రవేశించి హుండీ పగలగొట్టి నగదు, అమ్మవారి కానుకలు ఎత్తుకెళ్లాడు. దొంగతనం చేస్తున్న దృశ్యాలు ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. దేవాలయ కమిటీ ప్రతినిధుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Hundi Theft At Saibaba Temple In Jagtial District : గత నెల జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలోని సాయిబాబా, రాజరాజేశ్వర స్వామి దేవాలయాల్లో కూడా చోరి జరిగింది. శనివారం వేకువ జామున గుర్తు తెలియని వ్యక్తి దోపిడీకి పాల్పడ్డాడు. గ్రామ శివారులో ఉన్న రెండు ఆలయాల్లో అర్ధరాత్రి దాటాక ఆలయాల ప్రహరీ గోడలు దూకి వెంట తెచ్చుకున్న ఆయుధంతో కిటికీని విరగ్గొట్టాడు. లోపలికి దూరి గునపంతో హుండీలను పగులగొట్టి అందులో ఉన్న కానుకలను ఎత్తుకెళ్లాడు.