Huge Black Jaggery Seize in Rangareddy :రూ.1.20 కోట్ల విలువైన నల్ల బెల్లం స్వాధీనం.. పక్కా సమాచారంతో ఎక్సైజ్ దాడులు - గుడుంబా రహిత తెలంగాణ
🎬 Watch Now: Feature Video
Published : Oct 31, 2023, 7:27 PM IST
Huge Black Jaggery Seize in Rangareddy : రంగారెడ్డి జిల్లాలోని బెల్లం కోల్డ్ స్టోరేజ్‌లపై.. పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్రమంగా నల్ల బెల్లం నిల్వ ఉందని విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు ఏకకాలంలో రెండు చోట్ల దాడులు నిర్వహించారు. వరుసగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పటేల్ గూడలోని చేకూరి కోల్డ్ స్టోరేజ్, హయత్ నగర్ పరిధి కోహెడలోని వైష్ణవి కోల్డ్ స్టోరేజ్‌లపై దాడులు చేశారు. నల్లబెల్లంతో ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో సారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఈ దాడులు చేసినట్లు హయత్ నగర్ ఎక్సైజ్ సీఐ లక్ష్మణ్ తెలిపారు.
సుమారు 30 టన్నుల నల్లబెల్లం ఉన్నట్లు తెలిపారు. నగరంలోని పలు దుకాణాల పేర్లతో నిలువ ఉంచినట్లు తెలుసుకున్న పోలీసులు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నల్ల బెల్లం విలువ సుమారు రూ. కోటి 20 లక్షలు ఉన్నట్లు తెలిపారు. సోమవారం జరిగిన గుడుంబా దాడుల్లో కొందరు నిందితులను అరెస్ట్ చేసి విచారించగా.. నాటుసారాకు కావాలసిన బెల్లం ఈ కోల్డ్ స్టోరేజ్‌ల నుంచి వస్తోందని సమాధానం ఇచ్చినట్లు సీఐ వివరించారు.