High Water Level In Hussain Sagar : నిండుకుండలా హుస్సేన్‌సాగర్.. లోతట్టు ప్రాంతాల అప్రమత్తం - హైదరాబాద్ వార్తలు
🎬 Watch Now: Feature Video
Hussain Sagar Water Level Increased : హైదరాబాద్‌లో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. డ్రైనేజీలు ఎక్కడంటే అక్కడ పొంగుతున్నాయి. ప్రజలు రాకపోకలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో చిన్నపాటి వర్షం కురిస్తే చాలు రోడ్లపై నీరు వచ్చి చేరుతుంది. రోడ్లన్నీ నీటితో నిండిపోవడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌కు ప్రత్యేక ఆకర్షణగా ఉన్న హుస్సేన్‌సాగర్ నిండుకుండలా మారింది. దీంతో ప్రజలు సాగర్ పరవళ్లను చూడడానికి భారీగా తరలివస్తున్నారు. యువత ఫొటోలు, రీల్స్ చేసుకుంటూ వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఫుడీస్ అయితే మంచి వర్షంలో హాట్‌హాట్‌గా ఫుడ్ తింటూ వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు. మరోవైపు ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు హుస్సేన్‌సాగర్ గరిష్ఠ నీటిమట్టానికి చేరుకుంది. నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరడంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. హుస్సేన్‌సాగర్ లోతట్టు ప్రాంతాలను జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేశారు.