prabhas 10lakhs donation : రఘురామునికి రూ.10 లక్షలు విరాళంగా ఇచ్చిన హీరో ప్రభాస్ - actor prabhas lates updates

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 13, 2023, 5:13 PM IST

Hero Prabhas donates 10 lakh rupees for Bhadradri temple : నటుడు ప్రభాస్ తన సేవా భావాన్ని, ఉదారతను చాటుకున్నారు. మానవతా దృక్పథంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయానికి సినీ నటుడు ప్రభాస్ 10 లక్షల విరాళం పంపించారు. హీరో ప్రభాస్ ఆత్మీయులు 10 లక్షల రూపాయల చెక్కును ఆలయ ఈఓ రమాదేవికి ఈరోజు అందించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతిసనన్ సీతారాములుగా నటిస్తున్న సినిమా ఆదిపురుష్. రామాయణాన్ని 3డీ వర్షన్​లో నిర్మితమైన ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదిపురుష్ సినిమా విజయవంతం కావాలని సంకల్పంతో భద్రాద్రి సీతారామయ్యకు హీరో ప్రభాస్ రూ.10 లక్షల విరాళం పంపించినట్లు తెలుస్తోంది. భద్రాద్రి ఆలయానికి వచ్చిన హీరో ప్రభాస్ ఆత్మీయులు ఈ చెక్కును ఆలయంలోని ఈవో ఛాంబర్​లో ఈఓ రమాదేవికి అందించారు. ప్రభాస్ పది లక్షల రూపాయలను విరాళంగా అందించడం పట్ల ఆలయ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.