Heavy Rain in Hyderabad : హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. తడిసి ముద్దైన జనం - హైదరాబాద్‌లో భారీ వర్షం
🎬 Watch Now: Feature Video
Heavy Rain in Hyderabad Today : హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని కోఠి, ఖైరతాబాద్, బేగంబజార్, సుల్తాన్ బజార్, సైఫాబాద్, నాంపల్లి, బషీర్బాగ్, లక్డీకపూల్, అబిడ్స్, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణగూడ, ట్యాంక్బండ్లలో వాన పడింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తడిసి ముద్దయ్యారు. వర్షం నుంచి కాపాడుకోవటానికి వంతెనల కిందకు భారీగా చేరారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది.
ఇదిలా ఉండగా.. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున సాయంత్రం వేళ పడిన వర్షానికి కాస్త ఉక్కపోత తగ్గింది. నగరవాసులు చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించారు. వర్షంతో వేడితో పాటు ఉక్కపోత కూడా తగ్గిందని నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. జులైలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని.. బయటకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రాత్రి సమయాల్లో వాహనాలను నడిపినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.