కారు బానెట్‌పై కానిస్టేబుల్.. కి.మీ లాక్కెళ్లిన దుండగులు.. ఆఖరికి..
🎬 Watch Now: Feature Video
పంజాబ్‌లోని లుథియానాలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టారు దుండగులు. కారు బానెట్‌పై పడ్డ ఆయనను సుమారు కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లారు. వాహనం ఆపాల్సిందిగా సూచించిన కానిస్టేబుల్‌పై ఆ దారుణానికి పాల్పడ్డారు. స్థానిక మాతా రాణి చౌక్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాద దృశ్యాలు స్థానిక సీసీటీవీలో రికార్డయ్యాయి.
శుక్రవారం విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ హర్దీప్‌సింగ్.. వేగంగా వస్తున్న ఓ కారును ఆపాలని సూచించారు. కారు నడిపే వ్యక్తి వాహనాన్ని ఆపకుండా.. కానిస్టేబుల్‌ను ఢీకొట్టాడు. దీంతో కానిస్టేబుల్ కారు బానెట్‌పై పడ్డారు. అనంతరం డ్రైవర్ కారును జలంధర్ బైపాస్ దిశగా దాదాపు కిలోమీటరు దూరం పోనిచ్చాడు. ఆ దారిలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల కారు వేగాన్ని సడెన్‌గా తగ్గించాడు. దీంతో కానిస్టేబుల్ హర్దీప్‌సింగ్ కిందపడ్డాడు. వెంటనే వాహనం నడిపిన డ్రైవర్, అందులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యారు. నిందితులు ఇద్దరిని గుర్తించామని పోలీసులు తెలిపారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు. వారికి నేర చరిత్ర ఉందని పోలీసులు పేర్కొన్నారు.
ట్రాఫిక్ పోలీసుపైకి దూసుకెళ్లిన కారు.. బానెట్‌పైనే లాక్కెళ్లి..
నెల రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లోని ఇందోర్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ట్రాఫిక్ పోలీసులు వేగంగా వెళ్తున్న ఓ కారును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే ఆ కారు డ్రైవర్ రెడ్ లైట్ పడినా కారును ఆపకుండా పోలీసు పైకి దూసుకెళ్లాడు. దీంతో ట్రాఫిక్ పోలీస్ కారు బానెట్‌పై పడిపోయాడు. అయినాసరే కారును ఆపకుండా డ్రైవర్ చాలా దూరం వరకు పోలీసును లాక్కొని వెళ్లాడు. ఈ ఘటన అంతా కూడలిలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఫుటేజీ ఆధారంగా కారు డ్రైవర్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి