మేం అరెస్టులు చేసుంటే సగం మంది కాంగ్రెస్ వాళ్లు జైల్లోనే ఉండేవారు : హరీశ్‌రావు - నర్సాపూర్‌లో హరీశ్‌రావు బహిరంగ సభ
🎬 Watch Now: Feature Video
Published : Dec 13, 2023, 5:55 PM IST
Harish Rao Sensational Comments on Congress : తాము అధికారంలో ఉన్నప్పుడు అరెస్టులు చేసి ఉంటే సగం మంది కాంగ్రెస్ వాళ్లు జైళ్లోనే ఉండేవారని మాజీ మంత్రి హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నర్సాపూర్ పట్టణంలో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభకు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పనితనం తప్ప పగతనం తెలియని నాయకుడు కేసీఆర్ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రజల ఆకాంక్షలను, అవసరాలను తీర్చి కడుపులో పెట్టుకొని చూసుకున్నది బీఆర్ఎస్ పార్టీ అని అన్నారు.
ప్రజల పక్షాన పోరాటం చేసి, ప్రజల కోసం పనిచేశామన్నారు. కాంగ్రెస్ వాళ్లు గోబెల్స్ ప్రచారం చేశారని, బీఆర్ఎస్ చేసిన కృషి నిలకడ మీద తెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. నర్సాపూర్ బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని నిరూపించారని, ఇక్కడ గెలిచిన పార్టీ రాష్ట్రంలో గెలవనందుకు బాధగా ఉందని తెలిపారు. ఇవాళ పార్లమెంట్‌లో జరిగిన ఘటన బాధాకరమని, ఘటనపై తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్ తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాటలు ఘనంగా ఉండటం కాదు చేతలు కూడా ఘనంగా ఉండాలనీ కేంద్ర ప్రభుత్వంపై నిట్టూర్చారు.
TAGGED:
Narsapur Latest News