శ్వేతపత్రం ఒక తప్పుల తడక, అంకెల గారడీ : హరీశ్‌రావు - తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 2023
🎬 Watch Now: Feature Video
Published : Dec 20, 2023, 4:36 PM IST
Harish Rao on Telangana Government White Paper : ప్రభుత్వం రాష్ట్రఆర్థిక పరిస్థితిపై విడుదల చేసిన శ్వేతపత్రం పూర్తి తప్పులతడక, అంకెల గారడీగా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) విమర్శించారు. గ్యారంటీల నుంచి తప్పించుకునేందుకు సాకులు వెదుక్కుంటున్నారని ఆక్షేపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి భేషుగ్గా ఉందని అనేక ప్రభుత్వ సంస్థలు తెలిపాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంపై దుష్ప్రచారం రాష్ట్ర ప్రగతిని దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు. దివాలా రాష్ట్రంగా ప్రచారం చేస్తే పర్యవసానాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రాన్ని 'కూర్చున్న కొమ్మను నరుక్కునే అవివేకమైన చర్యగా' అభివర్ణించారు.
Harish Rao Reaction on Telangana Debts : ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం లేని వాటిని కూడా చెల్లించాలని తప్పుగా చూపించారని హరీశ్‌రావు అన్నారు. ఇలాంటి ప్రచారంతో పెట్టుబడులు రాకుండా పోతాయని హితవు పలికారు. అధికారంలోకి వచ్చాక కూడా దుష్ప్రచారం చేస్తే రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు. కాగా ఇవాళ అసెంబ్లీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) 42 పేజీల శ్వేత పత్రాన్ని విడుదల చేశారు.