Harish Rao on Assembly Elections : బీఆర్ఎస్ స్కీమ్స్ అన్నీ సూపర్ హిట్.. ఎవరెన్ని కుట్రలు చేసినా హ్యాట్రిక్ కేసీఆర్‌దే : హరీశ్‌రావు - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023
🎬 Watch Now: Feature Video
Published : Oct 27, 2023, 7:46 PM IST
Harish Rao on Assembly Elections : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధి తుర్కయాంజాల్ మున్సిపాలిటీ మన్నెగూడలోని ఓ గార్డెన్లో బీఆర్ఎస్ బూత్ కమిటీల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేయలేని పనులు.. సీఎం కేసీఆర్ చేసి చూపించారని మంత్రి పేర్కొన్నారు. బీఆర్ఎస్ స్కీమ్స్ అన్నీ సూపర్ హిట్ అని.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్ అని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ అంటే నమ్మకమని, కాంగ్రెస్ అంటే ఒక నాటకమని ఎద్దేవా చేశారు.
రైతుబంధు ఆపేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. యాసంగి పంటకు రైతుబంధు ఇవ్వొద్దని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసిందన్నారు. వ్యవసాయాన్ని దండుగగా మార్చిన చరిత్ర కాంగ్రెస్‌దని విమర్శించారు. రైతులపై పగ బట్టినట్లుగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని, బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. గెలుపు దిశగా కలిసికట్టుగా ప్రయత్నించాలని దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, డీసీసీపీ వైస్ ఛైర్మన్ కొత్త కురుమ సత్తయ్య, నియోజకవర్గ నాయకులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.