'చట్టసభల్లోకి ఎరుకులను తీసుకెళతాం' ఎరుకుల ఆత్మ గౌరవ సభలో హరీశ్‌రావు - Erukala Atma Gourava Sabha at Kukatpally
🎬 Watch Now: Feature Video
Published : Nov 5, 2023, 9:54 PM IST
Harish Rao in Erukala Atma Gourava Sabha at Kukatpally : ఎరుకుల జాతిని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని.. కేవలం సీఎం కేసీఆర్ మాత్రమే గౌరవించారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఎరుకుల సంక్షేమ పథకాల కోసం మాట్లాడే గొంతు ఉండాలని.. చట్టసభల్లోకి వారిని తీసుకెళుతున్నామన్నారు. ఇప్పటికే వారి సంక్షేమం కోసం రూ.60 కోట్లతో ఎంపవర్మెంట్ స్కీం ఏర్పాటు చేశామని తెలిపారు. మార్కెంట్ కమిటీ ఛైర్మన్ పదవులు, నిజాంపేటలో ఎకరం భూమితో పాటు భవనం కడుతున్నామని తెలిపారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన ఎరుకుల ఆత్మ గౌరవ సభలో హరీశ్‌రావుతో పాటు మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు.
Harish Rao Fires on Congress : గత ప్రభుత్వాలు ఏవీ కూడా ఈ జాతి గురించి ఆలోచించలేదని.. ప్రతి ఏడాది నాంచారమ్మ ఉత్సవాలను వైభవంగా రాష్ట్ర ప్రభుత్వమే జరిపిస్తోందని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు ఏం చేశారు.. తెలంగాణ శత్రువులు అంతా పొత్తులు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉందని.. రజినీకాంత్‌నే భాగ్యనగరాన్ని మెచ్చుకున్నారని వాపోయారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న గజినీలకు ఈ విషయం అర్థం కావడం లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.