Harish Rao in Dussehra Celebrations 2023 : 'సీఎం కేసీఆర్ నేతృత్వంలో.. రాష్ట్రం అన్ని రంగాల్లో అత్యంత వేగంగా పురోగతి సాధించింది' - సిద్దిపేటలో హరీశ్‌రావు దసరా వేడుకలు
🎬 Watch Now: Feature Video
Published : Oct 24, 2023, 12:46 PM IST
Harish Rao in Dussehra Celebrations 2023 : తెలంగాణ పాలపిట్ట ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా నిలుద్దామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దసరా పర్వదినాన పవిత్రమైన పాలపిట్ట సాక్షిగా ప్రమాణం చేసి రాష్ట్ర ప్రజలు.. కేసీఆర్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా నర్సాపూర్‌లో విజయదశమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి.. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆనందోత్సాహాలతో దసరా జరుపుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రజల జీవితంలో దసరాను మించిన పండుగ లేదని.. ఈ పండుగలోనే మన సంస్కృతి, సాంప్రదాయాలు దాగి ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు.
Harish Rao Dasara Celebrations at Siddipet : అమ్మవారి అశీస్సులతో ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని.. ప్రజలకు మరిన్ని విజయాలు అందించాలని మంత్రి ఆకాంక్షించారు. త్వరలోనే సిద్దిపేట వాసుల కల నెరవేరుతుందని పేర్కొన్నారు. దసరా నాటికి సిద్దిపేటకు రైలు తెస్తానని గత దసరా రోజు చెప్పానని.. అలాగే ఈ విజయదశమిలోపు సిద్దిపేటకు రైలు తెచ్చి దశాబ్దాల కల సాకారం చేసుకున్నామన్నారు. త్వరలోనే మరిన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడతామన్నారు. స్థానిక ప్రజల దీవెన, సీఎం కేసీఆర్ ఆశీస్సులతో సిద్దిపేట రాష్ట్రంలో ఎన్నో ప్రాంతాలకు ఆదర్శంగా నిలిచిందని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని.. అన్ని రంగాల్లో అత్యంత వేగంగా పురోగతి సాధించిందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.