Happy Birthday KTR : కేటీఆర్‌కు వెరైటీగా బర్త్ డే విషెస్.. డ్రోన్ విజువల్స్ అదిరిపోయాయి..! - కేటీఆర్‌కు వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు
🎬 Watch Now: Feature Video
KTR Birthday Special Video : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. పాలకుర్తి జడ్పీటీసీ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో లింగాపూర్ గ్రామంలోని పొలంలో "హ్యాపీ బర్త్ డే కేటీఆర్" అంటూ వరి నారుతో విషెస్ తెలిపారు. సుమారు 5 ఎకరాల పొలంలో వరి నారుతో మంత్రి కేటీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఐటీ మంత్రిగా కొనసాగుతున్న కేటీఆర్ మన రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలను ఏర్పాటు చేశారని, ఇదే క్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించారని పాలకుర్తి జడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి అన్నారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు స్వీకరించి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. రామగుండం నియోజకవర్గం ప్రజల తరఫున మంత్రి కేటీఆర్‌కు మరోసారి బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేశారు.
తన 47వ పుట్టినరోజు సందర్బంగా అనాథ పిల్లలకు సాయం చేయాలని మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని మహిళా శిశుసంక్షేమశాఖలో 10, 12వ తరగతి చదువుకుంటున్న 47మంది విద్యార్థులను వ్యక్తిగతంగా ఆదుకుంటానని తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఆ విద్యార్థులకు ఒక్కొక్కరికి ఒక్కో ల్యాప్‌ట్యాప్ ఇవ్వడంతో పాటు రెండేళ్లపాటు కోచింగ్‌ను తానే ఇప్పిస్తానని మంత్రి వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు తన పుట్టినరోజును పురస్కరించుకుని ప్రకటనల కోసం ఖర్చు పెట్టకుండా అనాథలకు అండగా నిలవాలని కేటీఆర్ కోరారు.