Hanamkonda Bus Stand Issue Employee Respond : ఈటీవీ-భారత్ కథనంపై స్పందించిన జిల్లా యంత్రాంగం - తెలంగాణ న్యూస్
🎬 Watch Now: Feature Video
Hanamkonda Bus Stand Issue : వర్షం వస్తే చెరువులా మారుతూ.. ప్రయాణీకులకు ఇబ్బందులు, ఏంటీ? ఇది బస్టాండా..? చెరువు అనుకున్నానే..? ఇలా హనుమకొండ ఆర్టీసీ బస్టాండ్‌పై ఈటీవీ, ఈటీవీ-భారత్‌లో వచ్చిన కథనంపై ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించారు. తక్షణమే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులు ఆర్టీసీ బస్టాండ్‌ను సందర్శించి.. మొత్తం తిరిగారు. ప్రస్తుతం పడుతున్న వర్షాలతో నీళ్లు నిలిచి చెరువులా మారుతున్న పరిస్థితిని గమనించారు. పరిసర ప్రాంతం అంతా బురదమయంగా మారిని తీరును.. అందుకు గల కారణాలను తెలుసుకున్నారు. తక్షణమే వరద నీటిని తొలగించి.. డ్రైనేజ్ వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. గుంతలు లేకుండా రోడ్లను మరమ్మతులు చేయాలని సూచించారు. ముందుగా తాత్కాలికంగా చర్యలు చేపట్టి.. వర్షం కారణంగా భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని కలెక్టర్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తెలిపారు. ప్రభుత్వ ఛీఫ్ విప్ వినయ్ భాస్కర్, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా.. ఇతర అధికారులు హనుమకొండ బస్టాండ్‌ను సందర్శించారు.