Guru Purnima in Telangana 2023 : రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు - గురు పూర్ణమి వేడుకలు
🎬 Watch Now: Feature Video
Guru Purnima Celebrations in Telangana 2023 : రాష్ట్రవ్యాప్తంగా గురు పూర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయాల్లో సాయిబాబా దర్శనానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి భక్తులు బారులు తీరి.. స్వామివారి దర్శనం చేసుకున్నారు. బాబాకు అభిషేకాలు, అర్చనలతో పాటు భజనలతో ఆలయాలు సందడిగా మారాయి. భక్తులు హారతి కార్యక్రమంలో పాల్గొని.. పల్లకి సేవ నిర్వహించారు. అభిషేకం, అలంకరణ, ధూపం, పూజలతో బాబాను స్మరించుకున్నారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్, పంజాగుట్ట, కూకట్‌పల్లి సహా పలు ప్రాంతాల్లో ఆలయాలు బాబా నామస్మరణలతో మార్మోగాయి.
గురు పూర్ణిమ సందర్భంగా ఆలయాలను రంగులు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన నిర్వాహకులు.. ఎక్కడికక్కడ అన్నదాన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. అలాగే కరీంనగర్లో సాయి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం 5 గంటల నుంచి ఆలయాల్లో బాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. బాబాకు ప్రీతికరమైన రొట్టెలను సమర్పించారు. కరీంనగర్ నగరంలోని సాయి నగర్ సాయిబాబా ఆలయం, సీతారాంపూర్ సాయి ఆలయం, భాగ్యనగర్ సాయి ఆలయాల్లోకి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆలయాలన్నీ సాయి నామస్మరణతో మార్మోగాయి. బంతిపూలతో అలకరించడంతో బాబా ఆలయాలు చూపరులను ఆకట్టుకున్నాయి.