Guns at Wedding Kamareddy : కత్తులు, తుపాకిీలతో డ్యాన్స్​.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ - kamareddy latest news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 13, 2023, 12:19 PM IST

guns at wedding barat in kamareddy : సాధారణంగా పెళ్లి బరాత్‌లో డ్యాన్స్​ చేయడం కామన్. కొంత మంది టపాసులు కాలుస్తూ స్టెప్పులేస్తూ హల్ చల్ చేస్తూ ఉంటారు. ఇంకొంత మంది మద్యం సేవిస్తూ.. మందు బాటిళ్లతో బరాత్​లో ఒళ్లు మరిచి చిందులేస్తుంటారు. ఇంకొందరు డబ్బును ఎగజల్లుతూ స్టెప్పులేస్తూ ఉంటారు. కానీ కామారెడ్డి జిల్లాలో మాత్రం ఓ వివాహ వేడుక అనంతరం జరిగిన బరాత్​లో కొంతమంది యువకులు కత్తులు, తుపాకులతో డ్యాన్స్‌ చేశారు. దీనికి సంబందించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

కామారెడ్డి జిల్లా మద్నూర్​లో యువకులు తుపాకీ, కత్తులతో నృత్యాలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మద్నూర్​లోని ఓ పెళ్లి వేడుకలో మూడు రోజుల క్రితం విందు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు యువకులు నృత్యాలు చేశారు. ఇందులో ఇద్దరి చేతుల్లో కత్తులు మరో యువకుడు చేతిలో తుపాకీ, తల్వార్​లు కనిపించాయి. అక్కడే ఉన్న మరికొందరు దృశ్యాలను వీడియో తీసి ఫేస్ బుక్ లో పెట్టడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. అది కాస్త పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ విషయంపై స్పందించిన స్థానిక ఎస్సై కృష్ణారెడ్డి యువకులను విచారిస్తామని చెప్పారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.