జేసీబీలో పెళ్లి మండపానికి వరుడు.. మాస్ డ్యాన్స్​లతో క్రేజీ బరాత్! - ఒడిశాలో జేసీబీలో వరుడు ఊరేగింపు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 3, 2023, 10:14 AM IST

సాధారణంగా పెళ్లికొడుకును పల్లకిలోనో.. కారులోనో తీసుకొస్తారు. కానీ ఒడిశాలో మాత్రం ఓ వరుడిని వినూత్నంగా జేసీబీలో తీసుకొచ్చారు. ఈ వింత సంఘటన బౌద్​ హర్భంగా బ్లాక్​లోని ఛతరంగ గ్రామంలో జరిగింది. గంగాధర్​ బెహరా అనే వ్యక్తికి సరస్వతి బెహరాతో వివాహం నిశ్చయమైంది. ఈ నేపథ్యంలోనే పెళ్లి ఊరేగింపు వెరైటీగా జేసీబీలో చేయాలని భావించాడు పెళ్లికొడుకు గంగాధర్​. ఇందుకోసం జేసీబీ ఆపరేటర్​గా పనిచేస్తున్న తన తమ్ముడిని సంప్రదించాడు. దీంతో అతడు జేసీబీ ముందు భాగంలో వరుడికి సోఫా ఏర్పాటు చేశాడు. పూలు, బెలూన్లతో జేసీబీని అందంగా అలంకరించారు. అనంతరం కుటుంబ సభ్యులు డ్యాన్స్ చేస్తుండగా.. వరుడిని ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఈ వేడుకను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపించారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.  

జేసీబీలో పెళ్లి ఊరేగింపు.. ఏం ఐడియా గురూ
గతంలో గుజరాత్ నవ్​సారిలో ఓ జంట పెళ్లి ఊరేగింపు ఇలానే జేసీబీలో జరిగింది. జేసీబీ ముందు భాగంలో వధూవరులకు సోఫా ఏర్పాటు చేసి ఊరేగించారు. రంగు రంగుల పూలు, వస్త్రాలతో జేసీబీని అందంగా అలంకరించారు. కుటుంబ సభ్యులు డ్యాన్స్ చేస్తుండగా.. వెనుక జేసీబీలో వధూవరులు వచ్చారు. ఈ వేడుకను చూసేందుకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.