Governor Tamilisai on Red Cross : 'ప్రతి 50 కిలోమీటర్లకు ఒక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటే లక్ష్యంగా పని చేయాలి'
🎬 Watch Now: Feature Video
Governor Tamilisai on Red Cross : ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ ఏర్పడిందని.. రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పని చేయాలని రెడ్‌క్రాస్ ప్రతినిధులకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ (Tamilisai Soundara Rajan) దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక బ్లడ్‌బ్యాంక్ ఏర్పాటే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన రెడ్‌క్రాస్ ప్రతినిధులతో రాజ్‌భవన్‌లో గవర్నర్ సమావేశమయ్యారు. త్వరలో రెడ్‌క్రాస్‌లో కొత్తవారికి సభ్యత్వం ఇస్తామని.. 20,000 మందిని సభ్యులుగా చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తమిళిసై చెప్పారు. ఎన్జీఓలను స్వచ్ఛంద సేవా సంస్థలను రెడ్‌క్రాస్ (Red Cross) కార్యక్రమాల్లో భాగస్వాముల్ని చేసి.. సంస్థ కార్యకలాపాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆమె కోరారు.
Tamilisai Soundara Rajan Meeting Red Cross Members : రాష్ట్రంలో ప్రస్తుతం రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో 8 బ్లడ్ బ్యాంకులున్నాయని.. ప్రతి జిల్లాకొకటి ఏర్పాటే లక్ష్యంగా కృషి చేస్తున్నామని రెడ్‌క్రాస్ ఛైర్మన్ అజయ్ మిశ్రా చెప్పారు. త్వరలో హైదరాబాద్, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కొత్తగా కేంద్రాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. సీపీఆర్ విధానంపై రెడ్‌క్రాస్ సొసైటీ.. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 42 శిబిరాల ద్వారా 12,855 మందికి శిక్షణ ఇచ్చిందని అజయ్‌మిశ్రా తెలిపారు.