Godavari level at Bhadrachalam : గోదావరికి జలకళ.. భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం - Bhadradri Kothagudem District News
🎬 Watch Now: Feature Video
Godavari level at Bhadrachalam 2023 : ఈ ఏడాది వర్షకాలం సీజన్ ఆరంభం నుంచి వరుణుడు దోబూచులాడుతున్నాడు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అంతగా వర్షాలు కురవకపోవడంతో రాష్ట్రంలోని నదుల్లో ప్రవాహం గణనీయంగా తగ్గిపోయింది. చాలా వరకు రిజర్వాయరలలో నీటిమట్టం పడిపోయింది. అయితే.. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు కొంతవరకు తెలంగాణకు శుభపరిణామంగా మారాయి. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరుగుతోంది. రెండు రోజుల క్రితం రెండు అడుగుల మేర మాత్రమే ఉన్న గోదావరి నీటిమట్టం గురువారం ఉదయానికి 13 అడుగులు దాటి ప్రవహిస్తోంది.
గోదావరి ఎగువ ప్రాంతంలో ఉన్న తాలువేరు ప్రాజెక్టు నుంచి కొంతమేర నీటిని విడుదల చేయడంతో పాటు, ఎగువ నుంచి వస్తున్న వరదనీటికి నీటిమట్టం స్వల్పంగా పెరుగుతోంది. రెండు రోజుల క్రితం చాలా తక్కువ ఉన్న గోదావరి నీటిమట్టం ఒకేసారి పది అడుగులకు పైగా పెరగడంతో గోదావరి ఒడ్డున ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలు వరదనీటిలో మునిగిపోయాయి. ఎగువ ప్రాంతం నుంచి ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉన్నందున.. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం కూడా పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యుూసీ అధికారులు చెబుతున్నారు.