కొత్త రేషన్ కార్డుల కోసం ప్రత్యేక ఫారం - ఇదిగో క్లారిటీ - ghmc commissioner comment
🎬 Watch Now: Feature Video
Published : Dec 30, 2023, 5:48 PM IST
GHMC Commissioner Visit To Prajapalana Centers : కొత్త రేషన్‌కార్డుల కోసం ప్రభుత్వం ఎలాంటి దరఖాస్తు ఫారంలు విడుదల చేయలేదని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనార్డ్ రోస్ స్పష్టం చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని చిక్కడపల్లి వార్డు కార్యాలయం, రామ్‌నగర్‌లోని ఎస్ఆర్టీ క్వార్టర్స్ సామాజిక భవనంలో ప్రజాపాలన కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్న ఫారం నిజం కాదని తెలిపారు.
అలాగే కొత్త రేషన్‌కార్డుకు ఎవరైనా దరఖాస్తు చేయాలనుకుంటే తెల్ల కాగితంపై కుటుంబ సభ్యుల వివరాలు రాసి తమ సిబ్బందికి ఇవ్వాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను తీసుకోవడానికి యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రతి సెంటర్ వద్ద మహిళలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. వృద్ధులకు, దివ్యాంగులకు వీల్ ఛైర్స్ అందుబాటులో ఉంచామన్నారు. ఐదు గ్యారంటీలే కాకుండా ఇతర సమస్యలకు సంబంధించి దరఖాస్తులను తీసుకోవడానికీ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.