పోలింగ్ కేంద్రం వద్ద ఎంత క్యూ ఉందో గంటగంటకూ ప్రజలకు అప్డేట్ : రోనాల్డ్ రోస్ - తెలంగాణలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-11-2023/640-480-20060099-thumbnail-16x9-ghmc.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Nov 19, 2023, 12:08 PM IST
GHMC Commissioner Ronald Rose Interview : జీహెచ్ఎంసీ పరిధిలో ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్(Ronald Rose) తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటరు వెరిఫికేషన్ చేశామని.. బీఎల్వోలతో ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్పులు పంపిణీ చేసి ఓటరు సంతకాలు కూడా తీసుకుంటున్నామని చెప్పారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎంత క్యూ ఉందో ప్రజలకు గంట, గంటకు జీహెచ్ఎంసీ వెబ్ సైట్ ద్వారా అప్ డేట్ చేస్తామన్నారు.
GHMC Commissioner on Telangana Election 2023 : గ్రేటర్లో 2.75 లక్షల మంది డూప్లికేట్స్ ఓట్లను తీసివేశామని.. ఒకే వ్యక్తి 2, 3 అప్లికేషన్ పెట్టడంతో డూప్లికేట్స్ ఓట్లు అయ్యాయని ఇళ్లు మారిన వారు.. ఓటును షిఫ్ట్ చేసుకోకుండా ఉండడంతో ఈ సమస్య ఏర్పడిందని చెప్పారు. ఇప్పటి వరకు రూ.52.5 కోట్లు పట్టుబడగా.. జిల్లా గ్రీవెన్స్ కమిటీ ద్వారా రూ.19.5 కోట్లు వెనక్కి ఇచ్చామని స్పష్టం చేశారు. సిబ్బందికి ఇబ్బందులు లేకుండా డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసిప్షన్ సెంటర్, కౌంటింగ్ అన్నీ ఒకే దగ్గర చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామంటున్న హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్తో ఈటీవీ భారత్ ముఖాముఖి.