మైలార్‌దేవ్‌పల్లిలో గంజాయి గ్యాంగ్ హల్చల్ .. ఈసారి..! - Ganja Gang Hulchul at Rajendranagar
🎬 Watch Now: Feature Video
Ganja Gang Hulchul at Rajendranagar : రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో దాడులు ఎక్కువవుతున్నాయి. ఇటీవల ఓ మైనర్ బాలుడిపై దాడికి పాల్పడిన దుండగులు.. తాజాగా రాజేంద్రనగర్ బృందావన్ కాలనీలో హల్ చల్ చేశారు. చిన్న పిల్లలు గొడవ పడుతుండగా విడిపించేందుకని వెళ్లిన నలుగురిపై విచక్షణా రహితంగా దాడికి దిగారు. కర్రలు, కత్తులు, రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. దుండగుల దాడిలో గాయపడిన రావుల భాస్కర్, రాజు, విశాల్, విక్రాంత్‌లను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు.
దుండగుల దాడిలో విక్రాంత్ మెడకు కత్తి గాయం కావడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మిగతా ముగ్గురు బాధితులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే దుండగులు కావాలనే తమ వారిపై దాడి చేసినట్లు బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.