ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఫర్నీచర్ తరలింపు - బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం - Bodhan Latest News
🎬 Watch Now: Feature Video


Published : Dec 5, 2023, 1:39 PM IST
Former MLA Shakil Followers Moving Furniture In Nizamabad : నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి ఫర్నీచర్ తరలించడానికి మాజీ ఎమ్మెల్యే షకీల్ అనుచరులు ప్రయత్నించారు. పార్టీ ఆపీస్లో వాహనాన్ని గమనించి కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు సమాచారం ఇవ్వగా సామగ్రి తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయంలోని ఏసీలు, ఫ్యాన్లు, ఎల్ఈడీ లైట్లు, కుర్చీలు, టేబుల్లు, వాటర్ ట్యాంక్‌లు తరలించడానికి యువకులు యత్నించారు. కార్యాలయంలోని అద్దాలు, ఫాల్ సీలింగ్ యువకులు పగులగొట్టారు.
Police Registered Case Against Former MLA Shakil Followers : పోలీసులు యువకులను విచారించగా ఎమ్మెల్యే షకిల్ చెందిన సామాగ్రి అందుకే తరలించడానికి వచ్చామని తెలిపారు. ఆఫీస్ నిర్వహణ చేసే వ్యక్తినని క్యాంపు కార్యాలయం వేరొక చోటుకు బదిలీ అయ్యిందని అందుకే సామాగ్రిని తరలిస్తున్నామని పోలీసులకు చెప్పారు. పోలీసులు వారిని స్టేషన్‌కు తరలిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దీంతో క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్త నెలకొంది.