మంత్రి కొండా సురేఖను కలిసిన అటవీశాఖ, దేవాదాయ శాఖ అధికారులు - కొండా సురేఖను కలిసిన దేవాదాయ అధికారులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Dec 10, 2023, 4:21 PM IST

Forest Department Officials meet Minister Konda Surekha : రాష్ట్రంలో అడవులు, పర్యావరణ రక్షణకు, పచ్చదనం మరింతగా పెంచేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని రాష్ట్ర అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఆమె పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. సచివాలయం నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో పూజలు చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు. 

Endowments Dept Officials meet Minister Konda Surekha : అయితే నేడు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్‌.ఎం.డోబ్రియాల్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు మంత్రిని ఆమె నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ ఇతర అధికారులు, పండితులు మంత్రి దంపతులను కలిసి ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పారు. 

డిసెంబరు 7వ తేదీన కొండా సురేఖ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కొండా సురేఖ గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పని చేశారు. ఈ శాసనసభ ఎన్నికల్లో ఆమె వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.