Fire Accident in Jagtial District : షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం.. రూ.20 లక్షల ఆస్తి నష్టం..! - telangana updates
🎬 Watch Now: Feature Video
Fire Accident in Jagtial District : జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెలుగొండలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పెసరి అశోక్ అనే వ్యక్తి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అవి క్రమంగా పక్కనే ఉన్న ఒకే కుటుంబసభ్యులైన పాండు, లచ్చవ్వ ఇంటికి వ్యాపించాయి. ప్రమాద సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూ ఇంట్లో లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు.
ఇంట్లో నుంచి పొగ రావడాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో రూ.1 లక్ష 50 వేల నగదు, వ్యవసాయ ఉత్పత్తులు, గృహోపకరణ వస్తువులు, ఫర్నీచర్, అలంకరణ వస్తువులతో పాటు వివిధ రకాల పత్రాలు దగ్ధమయ్యాయని బాధిత కుటుంబసభ్యులు రోధించారు. సుమారు రూ.20 లక్షల ఆస్తి నష్టం కలిగినట్లు తెలిపారు. కష్టపడి కూడపెట్టుకున్న సొమ్మంతా కాలిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు.