Fire Accident in Rajedranagar : అపార్ట్మెంట్లో మంటలు.. వాహనాలు దగ్దం.. ప్రాణాలు కాపాడిన రాఖీ పండుగ.. - అపార్ట్మెంట్ అగ్ని ప్రమాదం 2023
🎬 Watch Now: Feature Video


Published : Sep 1, 2023, 3:18 PM IST
Fire Accident in Rajedranagar Apartment : రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన రాజేంద్రనగర్లోని అపార్ట్మెంట్లోని సెల్లార్లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం జరిగి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అపార్ట్మెంట్వాసులకు చెందిన 9 బైకులు, ఒక కారు, సైకిళ్లు, వాచ్మెన్ గదికి మంటలు అంటుకున్నాయి. వాచ్మెన్ కుటుంబం రాఖీ పండుగ నిమిత్తం బంధువుల ఇంటికి వెళ్లడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.
Ssort Ccrcuit in Family Apartment : ఉదయం 6 గంటలకు నిద్ర లేచిన అపార్ట్మెంట్ వాసులు మంటలు ఎగిసిపడడం గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. విషయం తెలిసిన పోలీసులు ప్రమాదం జరిగిన చోటుకు చేరుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగుంటుందని అగ్నిమాపక శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంటలకు సీసీ కెమరాలు సైతం కాలిపోాయాయి. వాహనాల్లోని పెట్రోల్ ట్యాంకులు పేలిపోయాయని, ఎలక్ట్రిక్ వాహనాలు లేకపోవడంతో కొంత ముప్పు తప్పిందని స్థానికులు తెలిపారు.