Fire Accident LB nagar : పెయింట్ దుకాణంలో అగ్నిప్రమాదం.. మంటలు వ్యాపించి పాన్‌షాప్ దగ్ధం - telangana top news
🎬 Watch Now: Feature Video
Fire Accident In Paint Shop In LB Nagar : వేసవి వచ్చిందంటే చాలు అగ్నిప్రమాదాలు భయపెడుతూ ఉంటాయి. చిన్న అగ్గిరవ్వ పెను ప్రమాదానికి దారి తీస్తుంది. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో భారీ అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ఎల్బీనగర్లో కార్ షోరూంలో జరగిన భారీ అగ్ని ప్రమాదం మరవకముందే బుధవారం రాత్రి మరో ప్రమాదం చోటుచేసుకుంది.
బుధవారం రోజున అర్ధరాత్రి ఎల్బీనగర్ కూడలి సమీపంలోని ఏషియన్ పెయింట్ దుకాణంలో విద్యుత్ షాక్‌తో మంటలు అంటుకుని భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కరెంట్ పోల్ దుకాణానికి చాలా సమీపంగా ఉండటంతో ఇలాంటి ప్రమాదం చోటుచేసుకుంది. పెయింట్ దుకాణంలో చెలరేగిన మంటలకు పక్కన ఉన్న పాన్ షాప్‌లోకి మంటలు వ్యాపించాయి. దీంతో ఆ పాన్‌షాప్ పూర్తిగా దగ్దమైంది.
పెయింట్ దుకాణంలో పెయింట్ డబ్బాలు ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మంటల ప్రభావానికి చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. అగ్నిప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.