Balanagar Fire Accident : బాలానగర్‌లో అర్థరాత్రి కలకలం.. అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం - fire accidents
🎬 Watch Now: Feature Video
FIRE ACCIDENT IN Balanagar : మేడ్చల్ జిల్లా బాలానగర్‌లోని పది అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భవనంలోని 8వ అంతస్తులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఐడీపీఎల్ చౌరస్తాలోని ఏ టు ఏ అపార్ట్‌మెంట్‌లో 8 వ అంతస్తులో ఓ ఫ్లాట్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన ఫ్లాట్‌లో ఓ కుటుంబం నివసిస్తున్నప్పటికీ.. మంటలు చెలరేగిన గదిలో ఎవరూ లేకపోవడంతో ఎవరూ గాయపడలేదు. మంటలు ఎగిసిపడడంతో గమనించిన ఫ్లాట్ యజమాని కుటుంబంతో సహా బయటకు వచ్చేశాడు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో రెండు అగ్నిమాపక శకటాలతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. మంటలు ఇతర భవనాలకు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. మంటలు చెలరేగిన ఫ్లాట్ గదిలో గృహోపకరణాలు అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుదాఘాతం కారణంగానే మంటలు చెలరేగాయని అగ్నిమాపక శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ కోణంలోనే కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.