Fire accident in Nalgonda : వస్త్రదుకాణంలో షార్ట్ సర్క్యూట్.. దగ్ధమైన దుస్తులు - నల్గొండలో అగ్నిప్రమాదం
🎬 Watch Now: Feature Video
Fire accident in a garment shop in Nalgonda town : రాష్ట్రంలో వరుస అగ్ని ప్రమాదాలు కలవర పెడుతున్నాయి. వేసవికాలం కావడంతో పెద్దసంఖ్యలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. నాణ్యతలేని విద్యుత్ ఉపకరణాలను వినియోగించడం వల్ల షార్ట్ సర్క్యూట్ ఘటనలు జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో అగ్ని ప్రమాద కారణాలను పరిశీలిస్తే.. భవననిర్మాణ సమయంలో యాజమానులు పూర్తిస్తాయి నియమనిబంధనలు పాటించకపోవడం వల్లే చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయని అగ్నిమాపక అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వాధికారులు యథేచ్ఛగా భవన నిర్మాణ అనుమతులు జారీ చేస్తుండటం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.
తాజాగా నల్గొండ జిల్లాలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రకాశం బజార్‌లోని "జగిని టెక్స్ టైల్స్"లో అర్ధరాత్రి జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపుచేశారు. చుట్టుపక్కల వారికి ఎటువంటి నష్టం జరగకుండా పెను ప్రమాదం తప్పింది. బట్టలదుకాణం కావడంతో చూస్తుండగానే క్షణాల్లోనే కాలి బూడిదైంది. ఈ ఘటనతో సుమారు 20 లక్షల రూపాయాల మేర ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని వన్‌టౌన్ సీఐ రౌత్ గోపి తెలిపారు.