Fire Accident at Firdaus Mall : అబిడ్స్​లో అగ్ని ప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న మహిళ - అబిడ్స్​లో అగ్ని ప్రమాదం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 27, 2023, 4:13 PM IST

Updated : May 27, 2023, 4:50 PM IST

Fire Accident in Hyderabad :  హైదరాబాద్ అబిడ్స్ ట్రూప్ బజార్​లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫీర్డౌస్ మాల్​లోని రెండో అంతస్థులోని ఎల్​ఈడీ లైట్ హౌజ్ షో రూమ్​లో మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు మంటలు చెలరేగాయి. ఈ అంతస్థులో షార్ట్ సర్క్యూట్​తో మంటలు అంటుకున్నాయని పక్కన ఉన్న వ్యాపారులు తెలిపారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో పక్కన ఉన్న వ్యాపారులు భయబ్రాంతులకు గురి అయ్యారు. షో రూమ్​లో ఉన్న సిబ్బంది మంటలను చూసి అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో ఓ మహిళ ఆ మంటల్లో చిక్కుకుంది. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే ఆ ప్రదేశానికి చేరుకున్నారు. 

వారు మంటల్లో చిక్కుకుపోయిన మహిళను సురక్షితంగా రక్షించారు. మూడు అగ్నిమాపక లారీలు, 20 మంది సిబ్బందితో మంటలను అదుపులోకి తీసుకువచ్చారని అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.. సుమారు 50 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించవచ్చునని స్పష్టం చేశారు. ప్రమాదానికి  షార్ట్ సర్క్యూట్​ కారణమని ప్రాథమిక అంచనాకు వచ్చామని.. దర్యాప్తులో పూర్తి విషయాలు వెలుగుచూస్తాయని అగ్నిమాపక అధికారులు తెలిపారు. 

Last Updated : May 27, 2023, 4:50 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.